నన్ను చంపాలని చూస్తున్నారు: కరాటే కల్యాణి

Somebody are trying to kill me says Karate Kalyani
సినీ నటి కరాటే కల్యాణి ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేయాలనుకున్న దివంగత ఎన్టీఆర్ విగ్రహంపై ఆమె చేసిన వ్యాఖ్యలు చివరకు ఆమె కెరీర్ కే ముప్పును తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొచ్చాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసింది. మరోవైపు తాజాగా కల్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తనకు ప్రాణ హాని ఉందని, కొందరు తనను చంపేందుకు యత్నిస్తున్నారని కల్యాణి అన్నారు. తన కారు రెండు టైర్లను ఇటీవలే గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారని... అది తెలియకుండానే తాను ప్రయాణించానని... రోడ్డుపై వెళ్తుండగా కారు టైర్లు పేలిపోయానని చెప్పారు. ఒకవేళ ఈ ఘటన హైవేపై జరిగి ఉంటే తన పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. కావాలనే ఎవరో తన కారు టైర్లను కొంచెం కోసేశారని చెప్పారు. ఇటీవల ఒక గుడి వద్ద గొడవ జరుగుతుంటే హిందుత్వ వాదులతో కలిసి అక్కడకు తన కారులో వెళ్లానని... తిరిగి వస్తున్న సమయంలో కారు టైర్లు పేలిపోయాయని తెలిపారు.
Go Back to Shorts
Karate Kalyani
Tollywood
Life Threat

More Telugu News