మినీ మేనిఫెస్టోకే ఇంతగా మంటలు పుడితే..: జవహర్
- పూర్తి మేనిఫెస్టో వస్తే వైసీపీ నేతలకు మాటలు కూడా రావన్న జవహర్
- మహిళలను శక్తిమంతులుగా చేయడమే చంద్రబాబు లక్ష్యమని వ్యాఖ్య
- వైసీపీ చేయలేని పనులు తాము చేయబోతున్నామన్న జవహర్
మహిళలను శక్తిమంతులుగా చేయడమే చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. పేదరికాన్ని జయించేందుకు బిడ్డలు భారంగా మారకూడదనే చదివే బిడ్డలందరికీ రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించారని అన్నారు. మహిళల కంట కన్నీరు రాలకూడదనే ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు. బువ్వ పెట్టే రైతుకు ఆసరాగా సంవత్సరానికి రూ. 20 వేలు ఇస్తామని తెలిపారు. వైసీపీ చేయలేని పనులు తాము చేయబోతున్నామని చెప్పారు. మహానాడు విజయవంతం కావడంతో వైసీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.