Allu Arjun: 22 దేశాల్లో 'పుష్ప 2' రిలీజ్ .. దాదాపు అదే డేట్ ఖరారు!

  • షూటింగు దశలో 'పుష్ప 2'
  • ఫస్టు పార్టుకి మించి ఉంటుందనే టాక్
  • పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం 
  • కొత్త పాత్రలలో కనిపించనున్న మరికొంతమంది స్టార్స్
  • డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ చేసే ఛాన్స్  
Pushpa 2 movie update

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ కథానాయకుడిగా 'పుష్ప 2' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీ సరసన రష్మిక నటిస్తున్న ఈ సినిమాలో, ఈ సారి మరికొంతమంది స్టార్స్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. 

ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రావొచ్చనే ఒక టాక్ బలంగా వినిపించింది. కానీ అంతకంటే ముందుగానే .. అంటే డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారని అంటున్నారు. దాదాపు ఈ డేట్ ఖరారైనట్టేనని చెబుతున్నారు. ఆ దిశగానే చకచకా పనులు జరిగిపోతున్నాయని సమాచారం. 

ఐదు భాషల్లో ఈ సినిమాను 22 దేశాల్లో విడుదల చేయనున్నారని టాక్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఫస్టు పార్టు కంటే రెండో పార్టు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు.  పాత్ర రికార్డులను ఈ సినిమా తిరగరాస్తుందేమో చూడాలి.

More Telugu News