హమ్మయ్య టాస్ వేశారు... ఊపిరి పీల్చుకున్న ఆర్సీబీ

Toss in Bengaluru
షార్ట్స్‌లో చూడండి
బెంగళూరు నగరంలో ఈ సాయంత్రం భారీ వర్షం కురవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందా అనే అనుమానాలు రేకెత్తాయి. అయితే, సందేహాలన్నీ పటాపంచలు చేస్తూ కొద్దిసేపటి కింద చిన్నస్వామి స్టేడియంలో టాస్ వేశారు. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఇప్పటికే ప్లేఆఫ్ చేరిన గుజరాత్ టైటాన్స్ కు ఈ మ్యాచ్ లో ఓడినా నష్టం లేదు కానీ... ఆర్సీబీ జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ లో గెలవడం అత్యవసరం. ఆర్సీబీ ఈ మ్యాచ్ లో నెగ్గితే మెరుగైన రన్ రేట్ తో నాలుగో ప్లే ఆఫ్ బెర్తును కైవసం చేసుకుంటోంది. 

ఈ మ్యాచ్ ను లైట్ తీసుకుంటున్న గుజరాత్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అటు, బెంగళూరు జట్టులో లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ స్థానంలో హిమాంశు శర్మ వచ్చాడు. ఈ మ్యాచ్ 8.25 గంటలకు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 

వర్షంతో ఈ మ్యాచ్ రద్దయ్యుంటే ఆర్సీబీకి గుండె పగిలేది. 16 పాయింట్లతో ఉన్న ముంబయి ఇండియన్ ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకునేది.
Go Back to Shorts
Toss
Bengaluru
RCB
Gujarat Titans
IPL

More Telugu News