‘విమానం’ మూవీ నుంచి ‘సుమతి’ లిరికల్ సాంగ్ రెడీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘విమానం’ మూవీ నుంచి ‘సుమతి’ లిరికల్ సాంగ్ రెడీ!

Vimanam Movie Update
  • వైవిధ్యభరితమైన కథాంశంతో 'విమానం'
  • సుమతి అనే కీలక పాత్రలో అనసూయ
  • దర్శకుడిగా శివప్రసాద్ యానాల పరిచయం 
  • తెలుగు .. తమిళ భాషల్లో జూన్ 9న రిలీజ్
సినీ రంగంలోకి ఎంద‌రో న‌టీన‌టులు త‌మ‌దైన గుర్తింపు సంపాదించుకున్నారు. అందుకు కార‌ణం వాళ్లు ఎంపిక చేసుకునే విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లే. అలాంటి వెర్స‌టాలిటీ లేక‌పోతే ఆడియెన్స్‌కు క‌నెక్ట్ కారు. అలాంటి డిఫ‌రెంట్ రోల్స్‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. 'రంగ‌స్థ‌లం'లో రంగ‌మ్మ‌త్త‌గా అయినా, 'పుష్ప 2'లో దాక్షాయ‌ణిగా అయినా మెప్పించ‌టం ఆమెకే చెల్లింది. 

ఇప్పుడలాంటి మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌టానికి రెడీ అవుతోంది అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. ఆ సినిమాయే ‘విమానం’. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన పాత్ర‌ల‌న్నింటితో పోల్చితే ‘విమానం’ చిత్రంలో ఆమె చేసిన 'సుమ‌తి' పాత్ర చాలా వెరైటీగా ఉంటుంద‌ని రీసెంట్‌గా విడుద‌లైన ఆమె ఫ‌స్ట్ లుక్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. ఓ వైపు బోల్డ్‌గా ఉంటూనే ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో ఉండే పాత్ర ఆమెది.

 ఆమె పాత్ర‌కు సంబంధించి ‘సుమతి..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మే 22న విడుద‌ల చేయ‌బోతు‌న్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ టీజ‌ర్‌, 'రేలా రేలా' అనే లిరికల్ సాంగ్‌తో పాటు సుమ‌తి పాత్ర ఫ‌స్ట్ లుక్‌ మంచి బ‌జ్‌ను క్రియేట్ చేసింది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో, జీ స్టూడియోస్‌ - కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ సినిమాను నిర్మించారు. ఇంకా వీర‌య్య పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటించారు. జూన్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
Advertisement
Samudrakhani
Anasuya
Vimanam Movie

More Telugu News