హ్యాపీ బర్త్​డే బావ అంటూ తారక్​కు బన్నీ విషెస్​

Allu Arjun birthday wishes to Jr NTR
  • ఈ రోజు తారక్ పుట్టిన రోజు
  • శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్
  • కొరటాల శివతో ‘దేవర’చిత్రంలో నటిస్తున్న తారక్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ శనివారం 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయన అభిమానులు దీన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు తారక్‌కు విషెస్ చెబుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బావ’ అని బన్నీ ట్వీట్ చేశారు.

మంచి స్నేహితులైన తారక్, బన్నీ ఒకరినొకరు బావ అని పిలుచుకుంటారు. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీనికి ‘దేవర’ అనే టైటిల్ ఖరారైంది. తారక్ పుట్టిన రోజు కానుకగా టైటిల్, సినిమాలో ఆయన ఫస్ట్ లుక్‌ ను చిత్ర బృందం నిన్న విడుదల చేసింది. మరోవైపు బన్నీ..పుష్ప2 షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు.
Advertisement
Jr NTR
birthday
Allu Arjun
tweet

More Telugu News