Chaitanya Rao: 'అన్నపూర్ణ ఫొటో స్టుడియో' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

  • మరో చిన్న సినిమాగా 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథ 
  • చైతన్యరావు జోడీగా లావణ్య లక్ష్మి 
  • హైలైట్ గా అనిపిస్తున్న ఫొటోగ్రఫీ
Annapurna Photo Studio Lyrical Song Released

ఈ మధ్య కాలంలో గ్రామీణ నేపథ్యంలో సాగే కథలకు ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. అందువలన అలాంటి నేపథ్యంతో కూడిన కథలను తెరపై చూపించడానికి మేకర్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాంటి ఒక కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' రానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'భూమికి అందం ఊరు .. ఊరుకు అందం పైరు .. కొండల్లో దూకే సెలయేరు' అంటూ ఈ పాట సాగుతోంది. ప్రిన్స్ హ్యారీ కట్టిన బాణీ బాగుంది. శ్రీనివాస మౌళి సాహిత్యం .. సాయిచరణ్ ఆలాపన ఆకట్టుకుంటున్నాయి. పాటపై కట్ చేసిన పల్లె విజువల్స్ మనసుకు పట్టేలా ఉన్నాయి. 

యశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహించాడు. చైతన్యరావు - లావణ్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథ అనే విషయం టైటిల్ ను బట్టి చూస్తేనే అర్థమవుతోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. 

More Telugu News