Advertisement

ఎన్టీఆర్ విగ్రహం విషయంలో జూబ్లీహిల్స్ మోతీనగర్‌లో ఉద్రిక్తత

Tension in Jubilee Hills Motinagar over NTR statue
  • శతజయంతి ఉత్సావాల్లో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు
  • అనుమతి లేదంటూ తొలగించేందుకు వచ్చిన జీహెచ్ఎంసీ, పోలీసులు
  • ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుట్ర చేస్తున్నారంటూ టీడీపీ నేతల ఆరోపణ
దివంగత ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మోతీనగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో మోతీనగర్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. కానీ, విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు.

దాంతో, ఎన్టీఆర్ విగ్రహం తొలగించేందుకు సంఘటన ప్రదేశానికి జీహెచ్ఎంసీ అధికారులతో పాటు భారీగా పోలీసులు మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుట్రపూరితంగా ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తున్నారంటూ స్థానిక టీడీపీ నేతలు ఆరోపించారు. గతంలోనూ రెండుసార్లు ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారంటూ మాగంటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
NTR
statue
Tension
Jubilee Hills
Motinagar

More Telugu News