అమ్మపై నాన్న కత్తితో దాడి చేసి ఇంటిపై నుంచి తోసేశాడు.. పోలీసులకు వివరించిన కానిస్టేబుల్ కొడుకు

constable killed his wife in hyderabad
  • భార్య మెడ కోసి.. మొదటి అంతస్తు నుంచి కిందికి పడేసిన కానిస్టేబుల్
  • అడ్డువచ్చిన కొడుకు పైనా దాడికి యత్నించిన వైనం
  • పరారీలో నిందితుడు.. పోలీస్ స్టేషన్ ముందు బాధితుల ఆందోళన
కత్తితో భార్య మెడ కోసి.. మొదటి అంతస్తు నుంచి కిందికి పడేసి హత్య చేశాడో కానిస్టేబుల్. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమి నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కానిస్టేబుల్ కుంచపు రాజ్ కుమార్.. హైకోర్టులోని 4వ గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య శోభను హత్య చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు వారి కొడుకు తెలియజేశాడు. 

తన తల్లిపై తండ్రి కత్తితో దాడి చేసి.. ఇంటిపై నుండి తోసేసి చంపాడని కుమారుడు తెలిపాడు. తన తండ్రి మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో ఏడాదిగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని వెల్లడించాడు. అడ్డువచ్చిన తనపై కూడా కత్తితో దాడి చేశాడని బాలుడు చెప్పాడు. హంతకుడైన తన తండ్రిని పట్టుకొని శిక్షించాలని పోలీసులను కోరాడు.

శోభ బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దంపతుల మధ్య గొడవలు జరగ్గా.. గతంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి నచ్చచెబితే కాపురానికి పంపించామని.. ఇప్పుడు తమ కూతురిని పొట్టనబెట్టుకున్నారని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
Go Back to Shorts
constable
constable killed his wife
cutting neck with a knife

More Telugu News