బోల్డ్‌గా నరేశ్, పవిత్రా లోకేశ్ ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్
- తమ నిజ జీవితాన్నే తెరపై చూపిస్తున్న నరేశ్
- ఎంఎస్ రాజు దర్శకత్వంలో వస్తున్న చిత్రం
- ఈ నెల 26 విడుదల చేస్తున్నట్టు ప్రకటన
‘పార్వతీ, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా’ అని నరేశ్.. పవిత్రను అడగడంతో మొదలైన ట్రైలర్ లో వారి మధ్య పరిచయం ప్రేమగా మారడం నుంచి 'మా' ఎలక్షన్స్, బెంగళూరు హోటల్ ఎపిసోడ్, మూడో భార్యను ఆయన తన్నడం వరకు చూపెట్టారు. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమాను బోల్డ్ గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హీరో (నరేశ్) వెయ్యి కోట్ల ఆస్తిపై ఆయన మూడో భార్య కన్నేసినట్టు చూపించేలా ముసలోడు అని కనికరించి పెళ్లి చేసుకుంటే.. అంటూ వనితా విజయ్ కుమార్ తో డైలాగ్ చెప్పించారు. నటి అన్నపూర్ణ డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.
.