చాచా చౌదరి: మిస్టర్ కూల్‌కు కొత్తపేరు పెట్టిన ఇర్ఫాన్ పఠాన్
- చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు చేరుతుందన్న ఇర్ఫాన్
- ఏ జట్టు వచ్చినా చాచా చౌదరి స్టేడియం తలుపులు మూసేస్తాడని వ్యాఖ్య
- వ్యూహాలతో ప్రత్యర్థి జట్టును ఇరుకున పడేస్తాడన్న మాజీ ఆల్ రౌండర్
తమ సొంత మైదానం చేపాక్ కు ఏ జట్టు వచ్చినా చాచా చౌదరి ధోనీ స్టేడియం తలుపులు మూసేస్తాడని చెప్పాడు. ప్రత్యర్థి జట్టుపై కనికరం లేకుండా తన వ్యూహాలతో ఇరుకున పెట్టి పైచేయి సాధిస్తాడన్నాడు. చెన్నై అత్యంత పటిష్ఠమైన జట్టు అని, ఎదుటి జట్టుతో తనదైన రీతిలో వ్యవహరిస్తుందని ప్రశంసించాడు.
కాగా, ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్‌లలో గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.