Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు నందమూరి కుటుంబం థ్యాంక్స్

Nandamuri family thanks Rajinikanth
షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరైన దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు నందమూరి కుటుంబం థ్యాంక్స్ చెప్పింది. జైలర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరై తమ తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి గుర్తు చేసుకున్నారని నందమూరి రామకృష్ణ కుటుంబం తరఫున ధన్యవాదాలు చెబుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అదే సమయంలో అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అందరి కృషి ఉందన్నారు.

ఈ వేడుకలు పండుగలా జరిగాయని, ఇందుకు స్నేహితులకు, ఆత్మీయులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ థ్యాంక్స్ చెబుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ పాల్కే తదితర అవార్డులు దక్కించుకున్న రజనీకాంత్ కు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. రజనీకాంత్ ఈ వేడుకకు హాజరు కావడమే కాకుండా స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి ఎన్నో విషయాలు చెప్పారన్నారు.

ఎన్టీఆర్ ను యుగపురుషుడుగా పేర్కొన్నారని, ఆయన రాజకీయాల గురించి మాట్లాడారని తెలిపారు. ఈ వేడుకకు హాజరైన రజనీకాంత్ కు తెలుగు ప్రజానీకం, తన కుటుంబ సభ్యులు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నారన్నారు. ఎన్టీఆర్ మనవళ్లు, మనవరాళ్లు, నటుడు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ తదితరులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్లు అందులో పేర్కొన్నారు.
Go Back to Shorts
Rajinikanth
Balakrishna

More Telugu News