నా అంచనాలను తలక్రిందులు చేసిన సినిమా అది: గోపీచంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా అంచనాలను తలక్రిందులు చేసిన సినిమా అది: గోపీచంద్

Gopichand Interview
  • రిలీజ్ కి రెడీగా గోపీచంద్ 'రామబాణం' 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న గోపీచంద్ 
  • తనకి 'జయం' సినిమా అంటే ఇష్టమని వెల్లడి 
  • 'గౌతమ్ నంద' నిరాశపరిచిందని వ్యాఖ్య
గోపీచంద్ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'రామబాణం' సినిమా రెడీ అవుతోంది. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గోపీచంద్ తో 'జయం' సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ తేజ ఇంటర్వ్యూ చేశాడు. ఆయన అడిగిన ప్రశ్నలకు గోపీచంద్ సమాధానాలు చెబుతూ వెళ్లారు. 

గోపీచంద్ మాట్లాడుతూ .. "ఇంతవరకూ నేను చేసిన సినిమాల్లో నాకు 'జయం' అంటేనే ఎక్కువ ఇష్టం. ఆ సినిమాలో నేను విలన్ అయినప్పటికీ, అది నా కెరియర్ ను మార్చేసింది. ఈ సినిమా తరువాత నా రేంజ్ మారిపోతుందని మీరు చెప్పారు .. అలాగే జరిగింది. ఇక హీరోగా నేను చేసిన సినిమాల్లో 'యజ్ఞం' అంటే ఎక్కువ ఇష్టం" అని అన్నారు. 

"కొన్ని సినిమాలు ఆడతాయా ఆడవా అనే సంగతి, షూటింగు మొదలెట్టిన వారం రోజుల్లోనే అర్థమైపోతుంది. ఆ సినిమా పోతుందని తెలిసి కూడా నటించాలి .. అది నిజంగా చాలా కష్టమైన విషయం. నేను తప్పకుండా హిట్ అవుతుందనుకుంటే ఫ్లాప్ అయిన సినిమా 'గౌతమ్ నంద'. ఆ సినిమా నన్ను చాలా నిరాశపరిచింది. నా అంచనాలను తలక్రిందులు చేసింది" అని చెప్పుకొచ్చారు.

Advertisement
Gopichand
Teja
Jayam Movie

More Telugu News