బీజేపీతో పెళ్లి, టీడీపీతో కాపురం చేసే వ్యక్తి పవన్ కల్యాణ్: మంత్రి జోగి రమేశ్
- ఇటీవల చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం
- పవన్ సన్నాసి అయితే టీడీపీలో జనసేనను కలిపేయాలని సూచన
- దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్
- అమాయకులే పనవ్ ను సీఎం అంటున్నారని వెల్లడి
- పవనేమో చంద్రబాబు సీఎం అంటున్నాడని విమర్శలు
తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని, పవన్ కు చేతనైతే 175 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను బరిలో దించాలని జోగి రమేశ్ సవాల్ విసిరారు.
అమాయకులు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అంటున్నారని, కానీ పవనేమో చంద్రబాబు సీఎం అంటున్నాడని వివరించారు. పవన్ టీడీపీకి అమ్ముడుపోతాడని, అందరినీ చంద్రబాబుకు హోల్ సేల్ గా అమ్మేస్తాడని అన్నారు. జనసేన అభిమానులు కూడా జగనన్న బాటలోనే నడవాలని మంత్రి జోగి రమేశ్ పిలుపునిచ్చారు.