ఢిల్లీలో ప్రధానితో గోవా గవర్నర్ సమావేశం .. సింహాద్రి అప్పన్న దర్శనానికి ఆహ్వానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో ప్రధానితో గోవా గవర్నర్ సమావేశం .. సింహాద్రి అప్పన్న దర్శనానికి ఆహ్వానం

Ashok Gajapathi Raju meets PM Modi in Delhi and invites him to Simhadri Appanna temple
  • ప్రధాని మోదీతో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు భేటీ
  • సింహాద్రి అప్పన్న దర్శనానికి రావాలని ప్రధానికి ఆహ్వానం
  • మోదీకి సింహాచలం నారసింహుని ప్రతిమను అందించిన రాజు
  • దర్శనానికి వస్తానని ప్రధాని సూచించినట్లు వెల్లడి
  • గోవా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానికి వివరణ
గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న) దర్శనార్థం రావాల్సిందిగా ఆయన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు.

గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో అశోక్ గజపతి రాజు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో సింహాద్రి అప్పన్న స్వామివారి ప్రతిమను ఆయన ప్రధాని మోదీకి బహూకరించారు. ఆలయ ట్రస్ట్ తరఫున తాను ఈ ఆహ్వానాన్ని అందించినట్లు ఆయన పేర్కొన్నారు.

తన ఆహ్వానంపై ప్రధాని సానుకూలంగా స్పందించారని, త్వరలోనే స్వామివారిని దర్శించుకుంటానని హామీ ఇచ్చినట్లు అశోక్ గజపతి రాజు వెల్లడించారు. ఈ భేటీలో గోవాలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టుల పురోగతిని కూడా ఆయన ప్రధాని మోదీకి వివరించారు.                                
Advertisement
Ashok Gajapathi Raju
Narendra Modi
Goa Governor
Simhadri Appanna Temple
Simhachalam Temple Invitation
PM Modi Delhi Meeting

More Telugu News