ప్రశ్నించాడని చెంప ఛెళ్లుమనిపించిన ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు
- అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ
- హామీలు నెరవేర్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు
- స్థానిక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే
గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ సదరు వ్యక్తి నలుగురిలో గట్టిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లకు వచ్చి స్థానికంగా ఏం జరుగుతోందని అడుగుతున్నారా? అని అతడు నిలదీసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించినట్టు తెలిసింది.
కన్నబాబు తీరుపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ దురుసుగా ప్రవర్తించడమేంటని అడుగుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు, స్థానిక వైసీపీ పార్టీ నేతల మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే గో బ్యాక్ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కాగా, గతంలోనూ ఓ మారు ఓ యువకుడిపై ఎమ్మెల్యే కన్నబాబు చేయిచేసుకున్నారన్న ఉదంతం చర్చనీయాంశమైంది.