Chiranjeevi: 'మేడే' స్పెషల్ గా 'భోళాశంకర్'నుంచి మెగా పోస్టర్స్!

  • మెగాస్టార్ తాజా చిత్రంగా రూపొందుతున్న 'భోళాశంకర్' 
  • ఆయన సరసన అలరించనున్న తమన్నా 
  • మెగాస్టార్ చెల్లెలి పాత్రను పోషించిన కీర్తి సురేశ్ 
  • ఆగస్టు 11వ తేదీన సినిమా విడుదల 
Bhola Shakar Movie posters released

చిరంజీవి కథానాయకుడిగా 'భోళాశంకర్' సినిమా రూపొందుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి, మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. తమిళంలో కొంతకాలం క్రితం అజిత్ చేసిన సినిమాకి ఇది రీమేక్.ఈ కథ కోల్ కతా నేపథ్యంలో నడుస్తుంది. చిరంజీవి అక్కడి టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నారు. 'మేడే' సందర్భంగా ఈ సినిమా నుంచి చిరంజీవికి సంబధించిన కొన్ని పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. టాక్సీ డ్రైవర్ గా తనదైన స్టైల్లో ఈ పోస్టర్స్ లో మెగాస్టార్ కనిపిస్తున్నారు. ప్రతి పోస్టర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ అలరించనుంది. ఆమె పాత్రను ప్రధానంగా చేసుకునే ఈ కథ నడుస్తుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఎమోషన్ ను ప్రధానంగా చేసుకుని నడిచే ఈ మాస్ యాక్షన్ మూవీ, ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. 

More Telugu News