నా పేరు పక్కనే ధోనీ సర్ పేరు.. అది చాలు: ధృవ్ జురేల్
- రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ ఊహించని స్పందన
- ధోనీ అవుట్ చేయడాన్ని గర్వంగా భావిస్తానన్న క్రికెటర్
- రికార్డుల్లో ఎప్పటికీ నిలిచిపోతుందన్న సంతోషం
ధోనీ విసిరిన బంతి గురి తప్పకపోవడంపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చకు దారితీసింది. తనను లెజెండరీ వికెట్ కీపర్ ధోనీ అవుట్ చేయడం పట్ల జురేల్ స్పందించిన తీరు అభిమానులను ఇంకెంతో ఆకట్టుకుంది. దీనిపై జురేల్ మాట్లాడిన వీడియోని రాజస్థాన్ రాయల్స్ తన యూట్యూబ్ ఛానల్ లో ఉంచింది. తనను ధోనీ అవుట్ చేయడం తనకు ఎప్పుడూ చిరస్మరణీయంగా ఉండిపోతుందని జురేల్ వ్యాఖ్యానించాడు.
‘‘20 ఏళ్ల తర్వాత నేను స్కోరు కార్డును చూసినప్పుడు.. ధోనీ సర్ నన్ను రనవుట్ చేసినట్టు కనిపిస్తుంది. నేను దాన్ని చూసి ఎంతో గర్విస్తాను. అక్కడ నా పేరు ఉంటుంది. దాని పక్కనే ధోనీ సర్ పేరు కూడా ఉంటుంది. నాకు అది చాలు’’ అంటూ ధోనీ పట్ల తన అభిమానాన్ని జురేల్ చాటుకున్నాడు.