ప్రభుకు నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది: ఖుష్బూ

Prabhu will be in my heart for ever says Khushboo
  • ప్రభు, ఖుష్బూ కాంబినేషన్లో 32 ఏళ్ల క్రితం వచ్చిన 'చిన్నతంబి'
  • తెలుగులో 'చంటి' పేరుతో రీమేక్
  • తన పాత్ర అందరి హృదయాల్లో నిలిచిపోయిందన్న ఖుష్బూ
దర్శకుడు పి.వాసు, నటుడు ప్రభుకు తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉందని సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ తెలిపారు. ప్రభుతో కలిసి ఆమె నటించిన 'చిన్నతంబి' సినిమా విడుదలై నేటికి 32 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ రోజుల్లో ఈ సినిమా తుపాన్ క్రియేట్ చేసిందని చెప్పారు. 

ఈ సినిమా విడుదలై అప్పుడే 32 ఏళ్లు అవుతోందంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కె.బాలుకి, అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఇళయరాజాకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెపుతున్నానని అన్నారు. ఈ చిత్రంలోని తన పాత్ర అందరి హృదయాల్లో నిలిచిపోయిందని చెప్పారు. ఈ చిత్రం 1991లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. వెంకటేశ్, మీనా కాంబినేషన్లో ఈ సినిమాను 'చంటి' పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
Advertisement
Khushboo
Tollywood

More Telugu News