MS Dhoni: ధోనీపై బాలకృష్ణ స్పెషల్ ప్రోమో... వీడియో ఇదిగో!

Balakrishna explains Dhoni greatness in words
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ 16వ సీజన్ ఉత్సాహభరితంగా సాగుతోంది. టోర్నీలో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ అధికారిక ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ తెలుగు ప్రత్యేక ప్రోమో విడుదల చేసింది. టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ విశిష్టతలను వివరించడం ఆ వీడియోలో చూడొచ్చు. 

"15 ఏళ్ల కిందట ఓ సూర్యుడు పసుపు రంగు జెర్సీ ధరించి మనందరి జీవితాల్లో ఉదయించాడు. ఆ నెం.7 జెర్సీతో మనం కనెక్ట్ అయినప్పుడు జట్టులోకే కాదు నేరుగా మన గుండెల్లోకే ప్రవేశించాడు. అతడి టాలెంట్ వల్ల బెస్టాఫ్ ద బెస్ట్ కూడా అతడిని ఓడించలేకపోయింది. అతడు వికెట్ల వెనుక... మనం టీవీ సెట్ల ముందు... అలా ఆటను నడిపించాడు. కొందరికి మహి... కొందరికి కెప్టెన్ కూల్. ఆ తర్వాత 'తాలా' అయ్యాడు. 

గెలిపించిన వాడు, ఏడ్పించిన వాడు, నవ్వించిన వాడు... కానీ ఓటమిని అంగీకరించడం మాత్రం నేర్పలేదు.. మనమే కాదు, ప్రత్యర్థులు కూడా అభిమానించే ఆటగాడు.... ఇవీ ఆయన గురించి కొన్ని అద్భుత క్షణాలు! ఇలాంటి అద్భుత క్షణాలను లెక్కలేనన్ని అందించినందుకు ధన్యవాదాలు తాలా... ఎల్లప్పుడూ 7" అంటూ బాలయ్య తనదైన శైలిలో ప్రోమోను రక్తి కట్టించారు.
Go Back to Shorts
MS Dhoni
Balakrishna
Chennai Super Kings
IPL
Star Sports Telugu

More Telugu News