అతడు నాకు కాబోయే వాడే.. ఇప్పుడంతా ఓకే.. ఢిల్లీ వైరల్ వీడియోపై యువతి క్లారిటీ

Delhi Woman Hit On Road Says She Fought With Fiance
  • నడి వీధిలో ఢిల్లీ యువతిని బలవంతంగా కారులోని ఎక్కించిన ఉదంతం వైరల్
  • నెట్టింట కలకలం, యువతి భద్రతపై నెటిజన్ల ఆందోళన
  • రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభం
  • వైరల్ వీడియోపై తాజాగా క్లారిటీ ఇచ్చిన యువతి
  • యువకుడు తనకు కాబోయే వాడే అంటూ వివరణ 
ఓ యువతిని మెడబట్టి కారులోకి బలవంతంగా ఎక్కించిన ఘటన తాలూకు వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీలో వెలుగుచూసిన ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో వీడియోలోని యువతి అసలేం జరిగిందనేదానిపై క్లారిటీ ఇచ్చింది. తనను నెట్టిన వ్యక్తి తనకు కాబోయే భర్తేనని చెప్పుకొచ్చింది. తమ మధ్య గొడవ జరిగిందని, ప్రస్తుతం రాజీ పడిపోయామని కూడా పేర్కొంది. 

నార్త్ ‌వెస్ట్ ఢిల్లీలో వెలుగు చూసిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఓ యువకుడు ఆమెను బలవంతంగా కారులోకి నెట్టుతున్న వీడియో చూసిన నెటిజన్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్నట్టు వీడియోలో కనిపించింది. ఓ యువకుడు ఆమెను కారులోకి నెడుతుండగా మరో యువకుడు మౌనప్రేక్షకుడిలా మారిపోవడం తీవ్ర ఉత్కంంఠ రేపింది. దీంతో..యువతికి ఏమై ఉంటుందో అని నెటిజన్లు భయాందోళనకు లోనయ్యారు. దేశరాజధానిలో మహిళల భద్రత డొల్లేనంటూ పలువురు కామెంట్స్ చేశారు.  

విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. క్యాబ్ ఓనర్‌ ఆడ్రస్ గుర్తించిన అధికారులు అక్కడికి పోలీసులు పంపించారు. అయితే.. తన వీడియో వైరల్ కావడం గుర్తించిన యువతి దిద్దుబాటు చర్యలకు దిగారు. ఘటనపై తన వివరణను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘అది నాకూ, కాబోయే భర్త మధ్య తలెత్తిన ఓ బేధాభిప్రాయం. ఓ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఆ తరువాత మేం రాజీపడ్డాం’’ అని చెప్పింది. మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్న ఢిల్లీ పోలీసులకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపింది.
Go Back to Shorts
New Delhi
Viral Videos

More Telugu News