Prabhas: ఇటలీలో యాక్షన్ లోకి దిగిపోయిన ప్రభాస్!

  • 'సలార్' షూటింగులో బిజీగా ప్రభాస్ 
  • ఇటలీలో యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ
  • 85 శాతం షూటింగు పూర్తిచేసుకున్న సినిమా 
  • నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే 
  • ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్  
Salaar Movie Update

ప్రభాస్ ను మాస్ యాక్షన్ హీరోగా చూడటానికి అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందువల్లనే ఆయన హీరోగా రూపొందుతున్న 'సలార్'పై అంతకంతకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, హోంబలే బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోంది. 

రవి బస్రూర్ సమకూర్చిన సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ఇటలీలో జరుగుతోందని అంటున్నారు. ప్రభాస్ .. విలన్ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్స్ గా నిలవనున్నాయని అంటున్నారు.

ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు 85 శాతం వరకూ పూర్తవుతుందని చెబుతున్నారు. మిగతా భాగాన్ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారని అంటున్నారు. జగపతిబాబు - పృథ్వీ రాజ్ సుకుమారన్ పవర్ఫుల్ పాత్రలను పోషిస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News