నవీన్ హత్య కేసు: ఆ కత్తిని డీమార్ట్ లో కొన్నాడట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నవీన్ హత్య కేసు: ఆ కత్తిని డీమార్ట్ లో కొన్నాడట!

harihara krishna confession statement reveals in naveen case
  • తన ఫింగర్ ప్రింట్స్ పడకుండా ప్లాస్టిక్ గ్లౌజులు కొన్న హరిహర క‌ృష్ణ
  • నీహారికను ఇబ్బంది పెడుతున్నందుకే చంపినట్లు అంగీకారం 
  • పోలీసు కస్టడీలో కీలక విషయాల వెల్లడి
నవీన్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన స్నేహితుడినే అతికిరాతకంగా చంపిన ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ పోలీసుల కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. ఈ కేసులో అతడి స్టేట్ మెంట్ రికార్డును అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కోర్టు ముందు ఉంచారు.

వారం రోజుల పాటు హరిహరకృష్ణను విచారించిన పోలీసులు.. కీలక విషయాలను రాబట్టారు. నిహారికను ఇబ్బంది పెడుతుండంటంతోనే నవీన్ ను చంపాలని నిర్ణయించుకున్నట్లు అతడు ఒప్పుకున్నాడు. అందుకోసం రెండు నెలల క్రితమే డీమార్ట్ లో కత్తి, మెడికల్ షాప్ లో ప్లాస్టిక్ గ్లౌస్ కొన్నానని చెప్పాడు. 

‘‘ఇంటర్ సెకండ్ ఇయర్‌లో నవీన్ నాకు పరిచయం అయ్యాడు. అతడు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, నేను అరోరా ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాం. నిహారిక, నవీన్ ప్రేమించుకునే వారు. అయితే నవీన్ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడని.. నిహారిక గొడవ పడి అతనితో మాట్లాడటం మానేసింది. నిహారిక అంటే నాకు చాలా ఇష్టం.. అందుకే ఆమెతో చనువుగా ఉండే వాడిని. నవీన్ తో విడిపోయిందని తెలిసి 9 నెలల క్రితం నేను ప్రేమిస్తున్నానని నిహారికకు చెప్పాను. ఆమె ఒప్పుకుంది. అప్పటి నుండి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. నిహారికకు నవీన్ కాల్ చేసి, మెసేజ్‌లు చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. దీంతో నవీన్‌ను చంపాలని డిసైడ్ అయ్యాను’’ అని హరిహరకృష్ణ చెప్పాడు.

‘‘రెండు నెలల కిందట.. మలక్ పేట డీ మార్ట్ లో 200 రూపాయలకు ఒక కత్తి కొన్నాను. మర్డర్ టైంలో నా ఫింగర్ ప్రింట్స్ పడకుండా.. మెడికల్ షాప్ లో రెండు జతల ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నాను. అవి ఎవరికీ కనపడకుండా... నా బ్యాగ్ లో పెట్టి.. మా ఇంట్లో దాచాను’’ అని వివరించాడు.

ఫిబ్రవరి 16వ తేదీన నవీన్ ని మర్డర్ చేయాలని అనుకున్నానని.. కానీ కుదరకపోవడంతో 17న హైదరాబాద్ కు పిలిపించి హత్య చేసినట్టుగా హరిహరకృష్ణ తెలిపాడు. పెద్ద అంబర్పేట్లో మద్యం తాగి నవీన్ ను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి గొంతునొక్కి చంపేశానని వివరించారు. తర్వాత కత్తితో తల, మొండెం వేరు చేశానని వెల్లడించాడు. కోపంతో చాతి భాగం నుంచి పొట్ట భాగం వరకు కోసేశానని, గుండెను శరీరం నుంచి వేరు చేశానని చెప్పుకొచ్చాడు. అక్కడి నుంచి హాసన్ ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని అతనికి జరిగిందంతా చెప్పానని తెలిపాడు. మరుసటిరోజు మర్డర్ గురించి నిహారికకు చెప్పానని హరిహరకృష్ణ చెప్పాడు. 

హత్య చేసిన తర్వాత భయంతో విజయవాడ, ఖమ్మం, వైజాగ్ లో తిరిగానని, 24న పోలీసుల ముందు లొంగిపోయానని వెల్లడించాడు. ఈ కేసులో  ఏ1 నిందితుడిగా హరిహర కృష్ణ, ఏ2 నిందితుడిగా హాసన్, ఏ3 నిందితురాలిగా నిహారిక పేర్లను పోలీసులు చేర్చారు.
Advertisement
harihara krishna
naveen
confession statement
murder

More Telugu News