మనవడితో బాత్ టబ్ లో హోలీ వేడుకలు జరుపుకున్న తలసాని... వీడియో ఇదిగో!

మనవడితో బాత్ టబ్ లో హోలీ వేడుకలు జరుపుకున్న తలసాని... వీడియో ఇదిగో!

Talasani plays Holi with grandson in bath tub
  • నేడు హోలీ పర్వదినం
  • తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు
  • మనవడితో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపిన తలసాని
నేడు హోలీ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా వేడుక వాతావరణం నెలకొంది. ప్రజలు బంధుమిత్రులతో కలిసి హోలీ ఆడుతూ ఆస్వాదించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నివాసంలో మనవడితో కలిసి హోలీ ఆడారు. మనవడు తలసాని తారక్ తో కలిసి బాత్ టబ్ లో దిగిన ఆయన తాను కూడా ఓ చిన్న పిల్లాడైపోయారు. మనవడిలానే తాను కూడా ఓ పిచికారీ గన్ తీసుకుని రంగులు విరజిమ్ముతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తలసాని శ్రీనివాస్ యాదవ్ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నారు.
Advertisement
Talasani
Holi
Grandson
Talasani Tarak
BRS
Hyderabad
Telangana

More Telugu News