తెలంగాణలో మహిళా ఉద్యోగులకు ఈ నెల 8న సెలవు

Telangana Govt declares special holiday for women employees on March 8
  • మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కారు ప్రకటన
  • ప్రైవేటు సంస్థల్లోని మహిళా ఉద్యోగులకు క్యాజువల్ లీవ్
  • హోలీ పండుగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ శాఖలలోని మహిళా ఉద్యోగులు అందరికీ ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు స్పెషల్ క్యాజువల్ లీవ్ గా అనౌన్స్ చేసింది. మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలంటూ ఆదేశిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.

అదేవిధంగా ఈ నెల 8న హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఏటా మార్చి 8న మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటిస్తోంది. ఈ ఏడాది కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళల ఎదుగుదలను గుర్తించే రోజుగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఉమెన్స్ డే ను ఘనంగా జరుపుకుంటాయి.
Go Back to Shorts
march 8
womens day
special holiday
Telangana
BRS
women employees

More Telugu News