ఆస్కార్ అందించబోతున్న బాలీవుడ్ స్టార్ దీపిక
- ఈ నెల 12న లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం
- వేడుకలో ప్రెజెంటర్ గా ఎంపికైన దీపిక పదుకొణే
- గతేడాది కాన్స్ అవార్డుల జ్యూరీలో పాల్గొన్న హీరోయిన్
వీరితో పాటు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ వేడుకలో అవార్డులను అందజేసే ప్రెజెంటర్లలో ఒకరిగా ఆమె ఎంపికైంది. భారత్ నుంచి దీపికకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక కాన్స్ 2022లో జ్యూరీలో కనిపించిన దీపిక ఇప్పుడు ఆస్కార్ 2023లో ప్రెజెంటర్ గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని దీపిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రెజెంటర్ల జాబితాను పంచుకుంది. కాగా, ఆస్కార్ వేడుకలో దీపిక ఏ విభాగం అవార్డును అందించనుందనే విషయం తెలియాల్సి ఉంది.