నా జీవితంలోకి మౌనిక రావడం నా అదృష్టం: మంచు మనోజ్
- మార్చి 3న పెళ్లి చేసుకోబోతున్న మనోజ్, మౌనిక
- మంచు లక్ష్మి నివాసంలో సింపుల్ గా వేడుక
- ఇప్పటికే మొదలైన పెళ్లి పనులు
మనోజ్ అక్క మంచు లక్ష్మి నివాసంలో సింపుల్ గా కొంత మంది అతిథుల సమక్షంలో మార్చి 3న పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. ఇప్పటికే పెళ్లికి సబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. కానీ, విభేదాలు రావడంతో 2019లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. మౌనిక సైతం తన భర్తతో విడిపోయారు. కాగా మంచు మనోజ్ వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. ఇటీవల 'వాట్ ది ఫిష్' టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నట్టు వెల్లడించాడు.