భారత్ సాయం కోరిన ఉక్రెయిన్
- ఐక్యరాజ్యసమితిలో శాంతి తీర్మానం చేస్తున్న ఉక్రెయిన్
- తమకు మద్దతుగా నిలవాలని భారత్ కు విన్నపం
- తమ భూభాగం నుంచి రష్యా వెళ్లిపోవాలని వ్యాఖ్య
యుద్ధాన్ని ముగించడానికి ఏం చేయాలనేది తమ శాంతి ప్రణాళికలో వివరించామని చెప్పారు. కాల్పుల విరమణ వంటి తాత్కాలిక చర్యలను తాము కోరుకోవడం లేదని... తమ భూభాగం నుంచి రష్యా వెళ్లిపోవాలని తాము కోరుతున్నామని అన్నారు. ఈ ఏడాది యుద్ధానికి ముగింపు పడుతుందనే ఆశాభావంతో తాము ఉన్నామని చెప్పారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రేపు శాంతి ప్రణాళికను ఉక్రెయిన్ ప్రవేశపెట్టబోతోంది. గత ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది.