Akhil: 'ఏజెంట్' నుంచి ఫస్టు సాంగ్ ప్రోమో రిలీజ్!

  • 'ఏజెంట్'గా కనిపించనున్న అఖిల్ 
  • స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • కథానాయికగా సాక్షి వైద్య పరిచయం 
  • కీలకమైన పాత్రను పోషించిన మమ్ముట్టి 
  • ఏప్రిల్ 28వ తేదీన సినిమా విడుదల   
Ajent song promo released

అఖిల్ అభిమానులంతా 'ఏజెంట్' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. వక్కంతం వంశీ అందించిన కథతో రూపొందిన ఈ సినిమాలో, అఖిల్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.

ఈ సినిమాకి హిపాప్ తమిళ సంగీతాన్ని సమకూర్చాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు. 'మళ్లీ మళ్లీ నువ్వే ఎదురెదురొస్తే' అంటూ ఈ పాట సాగుతోంది. ఫుల్ సాంగ్ ను రేపు రాత్రి 7:03 గంటలకు రిలీజ్ చేయనున్నట్టుగా తెలియజేశారు. 

లవ్ ను టచ్ చేస్తూ సాగే స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. అఖిల్ జోడీగా 'సాక్షి వైద్య' పరిచయమవుతుండగా, కల్నల్ పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నాడు. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో అఖిల్ ఉన్నాడు.

More Telugu News