మరో 12 చీతాలు వచ్చేశాయ్.. వీడియో ఇదిగో!
- సౌతాఫ్రికా నుంచి గ్వాలియర్ చేరుకున్న విమానం
- అక్కడి నుంచి హెలికాప్టర్లలో కూనో నేషనల్ పార్క్ కు తరలింపు
- ఎన్ క్లోజర్లలోకి విడుదల చేయనున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
పార్క్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారెంటైన్ ఎన్ క్లోజర్లలోకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ వీటిని విడుదల చేస్తారు. ఈ ఎన్ క్లోజర్లలో చీతాలను 30 రోజుల పాటు ఉంచి పరిశీలించనున్నట్లు అధికారులు చెప్పారు. అనంతరం వాటిని మరో ప్రత్యేక ఎన్ క్లోజర్ లోకి మార్చుతామని చెప్పారు.
కాగా, గతేడాది సెప్టెంబర్ లో ఎనిమిది చీతాలను నమీబియా నుంచి తెప్పించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17న వాటిని కూనో నేషనల్ పార్క్ లోని ప్రత్యేక ఎన్ క్లోజర్లలోకి ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ చీతాలను పార్క్ అధికారులు హంటింగ్ ఎన్ క్లోజర్లలో ఉంచారు.