పెళ్లి పార్టీలో ఫుల్లుగా మందు కొట్టిన వరుడు... ఛీకొట్టి వెళ్లిపోయిన వధువు

Bride cancels marriage after groom drank heavily in pre wedding party
  • తమిళనాడులో ఘటన 
  • పెళ్లికి ముందు రాత్రి విందు
  • మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించిన పెళ్లికొడుకు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వధువు కుటుంబసభ్యులు
తమిళనాడులో ఓ పెళ్లింట మద్యం చిచ్చు రేపింది. కాంచీపురానికి చెందిన లక్ష్మీనరసింహన్ కు, చెంగల్పట్టు జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. సోమవారం పెళ్లి జరగాల్సి ఉండగా, ఆదివారం రాత్రి వధూవరుల కుటుంబాలు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నాయి. 

ఓ కల్యాణమండపంలో జరిగిన ఈ విందులో పెళ్లికొడుకు రెచ్చిపోయాడు. ఫుల్లుగా మందుకొట్టి ఊగిపోయాడు. మద్యం మత్తులో అతడి అసభ్య ప్రవర్తన పెళ్లికూతురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి వాడితో తన జీవితం కష్టాలపాలవుతుందని భయపడి ఆమె తనకీ పెళ్లి వద్దంటూ వేదిక దిగి వెళ్లిపోయింది. వధువు వెళ్లిపోవడంతో ఆ విందు మధ్యలోనే ఆగిపోయింది.

అంతేకాదు వరుడి నిర్వాకంతో ఆగ్రహించిన పెళ్లికూతురు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కల్యాణ మండపానికి వెళ్లి చూడగా, వరుడు తప్పతాగిని స్థితిలో కనిపించాడు. 

ఈ నేపథ్యంలో, పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు స్పష్టం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు... తాము వరుడికి కానుకగా ఇచ్చిన బంగారు గొలుసు, బంగారు ఉంగరం, బంగారు వాచీ వెనక్కి తీసేసుకున్నారు.
Go Back to Shorts
Bride
Groom
Drunk
Tamil Nadu

More Telugu News