Allu Arjun: 'పుష్ప 2' నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ఎక్కడంటే ..!

  • 'పుష్ప 2' పనుల్లో బిజీగా బన్నీ 
  • వైజాగ్ లో ఒక షెడ్యూల్ పూర్తి 
  • తదుపరి షెడ్యూల్ హైదరాబాదులో
  • ప్రత్యేకమైన సెట్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ
Pushpa 2 movie update

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సంచలనానికి తెరతీసింది. అప్పటి నుంచి అందరూ కూడా ఈ సినిమా సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగానే సీక్వెల్ పనులు మొదలయ్యాయి. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టారు. 

ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ ను 'వైజాగ్' లో పూర్తిచేశారు. అల్లు అర్జున్ తదితరులపై అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాదులోనే మొదలుకానుందని సమాచారం. 

హైదరాబాదులోని 'రామోజీ  ఫిల్మ్ సిటీ'లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమా కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఒక భారీ సెట్ వేశారట. మేజర్ పార్టు షూటింగ్ ఇక్కడ కొనసాగుతుందని అంటున్నారు. చాలా కీలకమైన సన్నివేశాలను ఈ సెట్లో ప్లాన్ చేశారని చెబుతున్నారు. రష్మిక కథానాయికగా మైత్రీవారు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

More Telugu News