ఎడ్యుకేషన్ మీద వచ్చేంత డబ్బు పాలిటిక్స్ లో రాదు: 'సార్' ట్రైలర్ రిలీజ్!

Sir Trailer Released
  • విద్యా వ్యవస్థలోని పరిస్థితులకు అద్దం పట్టే 'సార్'
  • ధనుశ్ జోడీ కట్టిన సంయుక్త మీనన్ 
  • ప్రతినాయకుడిగా కనిపిస్తున్న సముద్రఖని 
  • ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల  
ధనుశ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' సినిమా రూపొందింది. సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో రూపొందింది. తమిళంలో ఈ సినిమా 'వాతి' అనే టైటిల్ తో పలకరించనుంది. 

కొంతసేపటి క్రితం తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలోని పరిస్థితులపైనా, అందుకు కారకులవుతున్న వారిపైనా ఒక లెక్చరర్ తిరుగుబాటే ఈ కథ. కొంతమందికి మాత్రమే ఉన్నత విద్య అందుబాటులో ఉండటం పట్ల అతను చూపించే ఆవేశమే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు.

'ఎడ్యుకేషన్ లో వచ్చేంత డబ్బు పాలిటిక్స్ లో రాదు' .. 'డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు .. కానీ మర్యాద అనేది చదువు మాత్రమే సంపాదించిపెడుతుంది' అనే డైలాగ్స్ ట్రైలర్ లో హైలైట్ గా కనిపిస్తున్నాయి. సముద్రఖని .. 'ఆడుకాలం' నరేన్ .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది.
Advertisement
Dhanush
Samyuktha Menon
Samudrakhani
Sir Movie

More Telugu News