ప్రియురాలితో డాక్టర్ బ్రేకప్.. డిప్రెషన్ లో బెంజ్ కారుకు నిప్పు

Depressed After Breakup Doctor Sets His Mercedes On Fire In Tamil Nadu
  • తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఘటన
  • కారులో కూర్చుని ఆత్మహత్యకు యత్నించినట్లు భావిస్తున్న పోలీసులు
  • ఊపిరాడకపోవడంతో బయటికి వచ్చేశాడని వెల్లడి
ప్రేమలో విఫలమైన ఓ డాక్టర్ (29).. డిప్రెషన్ లో తన ఖరీదైన మెర్సెడెజ్ బంజ్ కారుకు నిప్పు పెట్టాడు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో జరిగిందీ ఘటన. సదరు డాక్టర్ కొన్నేళ్ల కిందట కాంచీపురంలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు తన క్లాస్ మేట్ తో ప్రేమలో పడ్డాడు. కానీ కొన్నాళ్లకు ఆమెతో విడిపోయాడు. ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. డిప్రెషన్‌ నుంచి బయటికి వచ్చేందుకు పునరావాస కేంద్రంలో చికిత్స కూడా తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే బెంజ్ కారుకు నిప్పు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. 

నిప్పు పెట్టిన తర్వాత తాను కారు లోపలికి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని సదరు డాక్టర్ ప్రయత్నించినట్లుగా అనుమానిస్తున్నారు. ‘‘గతంలో తన ప్రియురాలితో అతడు గడిపిన చోటు దగ్గరే ఈ ఘటన జరిగింది.  కారు కాలిపోతున్నా.. లోపలే కొద్ది సేపు ఉన్నాడు. కానీ ఊపిరి ఆడకపోవడంతో బయటికి వచ్చేశాడు. గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. కానీ అప్పటికే కారు మొత్తం కాలిపోయింది’’ అని ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పారు.

అతడి ప్రియురాలి గురించి తాము ఆరా తీశామని, ఆమె క్షేమంగానే ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు ఆమె అతడితో లేదని చెప్పారు.
Go Back to Shorts
Breakup
Doctor
Mercedes
Tamil Nadu
Depressed

More Telugu News