నందమూరి తారకరత్నకు గుండెపోటు.. యాంజియోగ్రామ్ చేసిన డాక్టర్లు
- కుప్పం పాదయాత్రలో కుప్పకూలిన తారకరత్న
- హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స
- స్టంట్ వేయకుండానే కోలుకున్న తారకరత్న
గత కొన్ని రోజులుగా తారకరత్న విశ్రాంతి లేకుండా ఉన్నారు. హిందూపురంలో బాలకృష్ణ పర్యటనకు సంబంధించి అన్నీ ఆయనే చూసుకున్నారు. ఇప్పుడు కుప్పంలో పాదయాత్రకు సంబంధించి కూడా ఆయన పర్యవేక్షణ చేశారు. కుప్పంకు ముందే చేరుకుని పనులను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన ఎంతో అలసిపోయారు. ఈ ఉదయం నుంచి కూడా ఉత్సాహంగానే ఉన్న ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.