Ram Charan: లాజ్ ఏంజెలెస్ లో కొత్త లుక్స్ తో రామ్ చరణ్ తేజ్

Ram Charan looks ultra stylish as he attends party in LA ahead of Golden Globes
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ్ కొత్త లుక్స్ తో అదరగొట్టాడు. హెయిర్ స్టయిల్ మార్చి, తెల్లటి టీషర్ట్, దానిపై సూట్ ధరించి పూర్తిగా కొత్త స్టయిల్ లో కనిపించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్, ఉపాసన లాజ్ ఏంజెలెస్ లో పర్యటిస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్స్ 2023 అవార్డుల కార్యక్రమం కోసం వారు అక్కడకు వెళ్లారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ రెండు కేటగిరీల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్లకు ఎన్నిక కావడం తెలిసిందే. అవార్డులు కచ్చితంగా లభిస్తాయనే నమ్మకం సినిమా బృందంలో కనిపిస్తోంది. 

ఈ పర్యటనలో భాగంగా అవార్డుల కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన ఓ పార్టీలో రామ్ చరణ్ పాల్గొన్నాడు. ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం ఈ నెల 11న బెవెర్లీ హిల్టన్ లో జరగనుంది. త్వరలో తల్లిదండ్రులు కానున్న రామ్ చరణ్, ఉపాసన దీని కోసం ముందుగానే అక్కడకు చేరుకోగా, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి సైతం రానున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా స్క్రీనింగ్ ను అమెరికాలో ఏర్పాటు చేయగా, దీనికి సినిమా బృందం మొత్తం హాజరైంది. ఆస్కార్ 2023 అవార్డులకు సైతం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నామినేషన్ కు అర్హత సాధించడం తెలిసిందే. 

Go Back to Shorts
Ram Charan
stylish looks
los angeles
usa
golden globes
rrr

More Telugu News