మళ్లీ క్రికెట్ పాలనా వ్యవహారాల్లోకి గంగూలీ
- ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తిచేసుకున్న దాదా
- అప్పటి నుంచి క్రికెట్ వ్యవహారాలకు దూరం
- తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్టర్ గా నియామకం
2019లో గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సలహాదారుగా వ్యవహరించారు. అదే ఏడాది బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో గంగూలీ ఐపీఎల్ పదవి నుంచి వైదొలిగారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పదవీకాలం ఇటీవలే ముగియగా, బోర్డుకు కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ వచ్చారు.