Chiranjeevi: ఆ యాక్షన్ సీన్లో మెగాస్టార్ అదరగొట్టేశారు: రామ్ లక్ష్మణ్

  • సంక్రాంతి బరిలో చిరూ .. బాలయ్య సినిమాలు 
  • రెండు సినిమాలకి ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ 
  • చిరూ యాక్షన్ సీన్ గురించి ప్రస్తావన 
  • ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని వ్యాఖ్య 
  • ఈ నెల 13వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా 
Ram lakshman Interview

టాలీవుడ్ లోని టాప్ యాక్షన్ కొరియోగ్రఫర్స్ గా రామ్ - లక్ష్మణ్ కనిపిస్తారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోని స్టార్ హీరోలలో చాలామందికి వాళ్లు ఫైట్ మాస్టర్స్ గా పనిచేశారు. అలాంటి రామ్ - లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేసిన 'వాల్తేరు వీరయ్య' .. 'వీరసింహా రెడ్డి' సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతుండటం విశేషం. 

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో 'వాల్తేరు వీరయ్య' గురించి రామ్ - లక్ష్మణ్ మాట్లాడుతూ "ఈ సినిమాలో చిరంజీవిగారికి .. కొంతమంది ఫైటర్స్ కి మధ్య ఒక యాక్షన్ సీన్ చేశాము. ఈ యాక్షన్ సీన్ లో శ్రుతి హాసన్ కూడా ఉంటుంది. హీరో ఒక వైపున ఆమెకి సైట్ కొడుతూ .. మరో వైపున ఫైట్ చేస్తుంటాడు. 

ఈ తరహా యాక్షన్ సీన్స్ ను చిరంజీవిగారు అదరగొట్టేస్తారని మాకు తెలుసు. అందువల్లనే ఆ ఫైట్ ను కొత్తగా డిజైన్ చేశాము. ఈ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్నప్పుడు మాతో పాటు షూటింగు స్పాట్ లో అందరూ కూడా ఎంజాయ్ చేశారు. థియేటర్లో కూడా ఈ యాక్షన్ సీన్ ను చూస్తూ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News