ముగిసిన సినీ నటుడు చలపతిరావు అంత్యక్రియలు
- జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
- అంతిమ సంస్కారాలను నిర్వహించిన కుమారుడు రవిబాబు
- హాజరైన సురేశ్ బాబు, మంచు మనోజ్ తదితర ప్రముఖులు
ఈ నెల 24న చలపతిరావు గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో ఉండటంతో వారి రాక ఆలస్యమయింది. దీంతో ఆయన భౌతికకాయాన్ని మహాప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచారు. ఈ ఉదయం 9 గంటల సమయంలో అంత్యక్రియలను నిర్వహించారు. 1,200కు పైగా చిత్రాల్లో నటించిన చలపతిరావు తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.