Chiranjeevi: చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' టైటిల్ సాంగ్ విడుదల

  • చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో చిత్రం
  • శ్రుతిహాసన్ కథానాయిక
  • పవర్ ఫుల్ పాత్రలో రవితేజ
  • దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
  • టైటిల్ సాంగ్ కు చంద్రబోస్ సాహిత్యం
Title song released from Chiranjeevi Waltair Veerayya

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో వస్తున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రం నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, పవిత్ర చారి ఆలపించారు. 

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. రవితేజ ఓ పవర్ ఫుల్ రోల్ పోషిస్తుండడం విశేషం. ఇందులో కేథరిన్ ట్రెసా కూడా నటిస్తోంది. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో యాక్షన్ ఎంటర్టయినర్ గా రూపుదిద్దుకుంటున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండడంతో థియేట్రికల్ ట్రైలర్ ను జనవరి 4న తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News