కొత్త సంవత్సరం సందర్భంగా.. చౌక ధరలకే విమాన ప్రయాణం
- దేశీ సర్వీసుల్లో రూ.2023కే టికెట్లను విక్రయిస్తున్న ఇండిగో
- అంతర్జాతీయ సర్వీసుల్లో రూ.4,999 నుంచి ఆరంభం
- రూ.1,497కే టికెట్ ను ఆఫర్ చేస్తున్న ఎయిరేషియా
2023 సంవత్సరం ఆగమనం సందర్భంగా రూ.2023కే ఒక్కో టికెట్ ను ఇండిగో అందిస్తోంది. దేశీ విమాన సర్వీసుల్లో టికెట్లను రూ.2023కు, విదేశీ సర్వీసుల్లో టికెట్లను రూ.4,999 నుంచి అందిస్తోంది. ఈ డిస్కౌంట్ సేల్ లో భాగంగా 2023 జనవరి 15 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య ప్రయాణాలపై ఆఫర్లను వినియోగించుకోవచ్చు.
ఎయిరేషియా ఇండియా సైతం న్యూ ఇయర్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. బెంగళూరు-కోచి తదితర మార్గాల్లో రూ.1,497కే టికెట్లను విక్రయిస్తోంది. డిసెంబర్ 25వ తేదీ వరకు చేసుకునే బుకింగ్ లపైనే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 2023 జనవరి 15 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య ప్రయాణ టికెట్లపై ఈ ఆఫర్లు పొందొచ్చు. ఎయిరేషియా పోర్టల్, మొబైల్ యాప్, ఇతర బుకింగ్ సైట్లలో బుకింగ్ లపై ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.