'వీరసింహా రెడ్డి' నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది .. ఎప్పుడంటే!

Veera Simha Reddy Movie Update
బాలయ్య అభిమానులు ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆయన తాజా చిత్రమైన 'వీరసింహారెడ్డి' నుంచి ఇటీవల వదిలిన 'సుగుణ సుందరి' పాట ఒక రేంజ్ లో దూసుకెళుతోంది. రికార్డు స్థాయిలో ఈ మాస్ బీట్ వ్యూస్ ను రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ తరువాత సాంగ్ రిలీజ్ గురించిన ఎనౌన్స్ మెంట్ వదిలారు. 

ఈ సినిమా కోసం తమన్ 'మా బావ మనోభావాలు' అనే పాటను స్వరపరిచాడు. ఈ పాటను ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం 3:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఈ పాటను కూడా బాలకృష్ణ - శ్రుతి హాసన్ బృందంపై చిత్రీకరించినట్టు తెలుస్తోంది. 

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ఈ కథలో, ప్రతినాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు. ఇక ఒక ముఖ్యమైన పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ పోషించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Go Back to Shorts
Balakrishna
Sruthi Haasan
Varalakshmi Sharath Kumar
Veerasimha Reddy

More Telugu News