Nikhil: ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు: '18 పేజెస్' నుంచి ట్రైలర్ రిలీజ్!

  • సరికొత్త ప్రేమకథా చిత్రంగా '18 పేజెస్'
  • మరోసారి నిఖిల్ జోడీ కట్టిన అనుపమ 
  • గోపీసుందర్ సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణ 
  • ఈ నెల 23వ తేదీన విడుదలవుతున్న సినిమా
18 pages movie trailer released

నిఖిల్ హీరోగా '18 పేజెస్' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 - సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. నిఖిల్ జోడీగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. విభిన్నమైన ప్రేమ కథాకథనాలతో ఈ సినిమా నడవనుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వెళ్లాయి. 
 
ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. లవ్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ కథ నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. 'ప్రేమించడానికి మనకి ఒక రీజన్ ఉండకూడదు .. ఎందుకు ప్రేమించావంటే ఆన్సర్ ఉండకూడదు' అంటూ అనుపమ పరమేశ్వరన్ చెప్పిన డైలాగ్ హైలైట్. 

సుకుమార్ ఈ సినిమాకి కథను అందించగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. అజయ్ .. బ్రహ్మాజీ ముఖ్యమైన పాత్రలను పోషించారు. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 'కార్తికేయ 2' తరువాత నిఖిల్ - అనుపమ కలిసి నటించిన ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఉన్నాయి

More Telugu News