స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలపై ప్రత్యేక చట్టం తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Special act in Telangana on atrocities over girls
  • ఇటీవల హైదరాబాదు డీఏవీ స్కూలులో దారుణం
  • చిన్నారిపై అత్యాచారం
  • తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సర్కారు
  • విద్యాసంస్థల యాజమాన్యాలను బాధ్యులను చేసేలా కొత్త చట్టం
తెలంగాణాలో పాఠశాలలు, కళాశాలల్లో అమ్మాయిల మీద అఘాయిత్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువస్తోంది. ఇటీవల హైదరాబాదులోని డీఏవీ స్కూలులో చిన్నారిపై అత్యాచారం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రత్యేక చట్టంపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ దీనిపై మాట్లాడారు. 

అమ్మాయిలపై ఏదైనా ఘటన జరిగితే సదరు స్కూలు, కాలేజీ యాజమాన్యాలను బాధ్యులను చేయడం ఈ చట్టంతో సాధ్యమవుతుందని వివరించారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల్లో చిన్నారులపై, యువతులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చట్టంతో మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. 

ఇక డ్రగ్స్ అంశంపైనా ఆయన స్పందించారు. గోవా డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిందని, గోవాలో ఉండి హైదరాబాదులో డ్రగ్స్ అమ్ముతున్నవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Go Back to Shorts
Special Act
Girls
Atrocities
Telangana

More Telugu News