Pooja Hegde: అందానికే అందం పూజ హెగ్డే .. లేటెస్ట్ పిక్స్ ఇవిగో!

  • నాజూకు భామగా పూజ హెగ్డేకి మంచి మార్కులు 
  • పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న హీరోయిన్ 
  • ఫ్లాపుల తరువాత కూడా తగ్గని క్రేజ్ 
  • యూత్ లో పెరుగుతూనే ఉన్న ఫాలోయింగ్ 
  • నెక్స్ట్ మూవీ మహేశ్ బాబుతో
Pooja Hegde Special

పూజ హెగ్డే టాలీవుడ్ లోకి అడుగుపెడుతూనే నాజూకు భామగా మంచి మార్కులు కొట్టేసింది. అందం .. అందుకు తగిన అభినయాన్ని కలిగిన పూజ హెగ్డేకు అదృష్టం కూడా తోడైంది. దాంతో అవకాశాలు ఆమె గుమ్మం ముందు క్యూ కట్టాయి. వరుస సినిమాలు .. వరుస విజయాలు పూజ స్థాయిని మరింత పెంచుతూ వెళ్లాయి. 

తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా మారడానికి పూజ ఎక్కువ సమయం తీసుకోలేదు. పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ఆమె తన జోరును కొనసాగిస్తూ వెళ్లింది. పూజ ఉంటే ఆ సినిమా హిట్టే అని స్థాయికి ఆమె గ్రాఫ్ వెళ్లింది. ఆమె డిమాండ్ చేసినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడలేదు. అలా రాకెట్ రేంజ్ లో ఆమె కెరియర్ దూసుకుపోతుండగా, వెంటవెంటనే మూడు ఫ్లాపులు ఆమెను పలకరించాయి. అదే మరో హీరోయిన్ అయితే డీలాపడిపోయేదే. కానీ పూజ లైట్ తీసుకుంది. తరువాత ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. త్రివిక్రమ్ - మహేశ్ బాబు ప్రాజెక్టులో ఆమెనే హీరోయిన్. ఈ సినిమా హిట్ అయితే ఆమె పుంజుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.  

తాజాగా ఆమె లేటెస్ట్ పిక్స్ ను వదిలారు. యాష్ కలర్ డ్రెస్ లో ..  వాలుకళ్లతో .. వేడి చూపులతో పూజ కుర్రమనసులను కట్టిపడేస్తోంది. భారీ ఫ్లాపుల తరువాత కూడా ఆమె క్రేజ్ తగ్గకపోవడానికీ .. అవకాశాలు వెతుక్కుంటూ రావడానికి ఆమె గ్లామర్ కారణమని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదేమో.

More Telugu News