megastar: ‘బాస్ పార్టీ’ పాట మొదట వినగానే చిరు రియాక్షన్ అదుర్స్.. వీడియో ఇదిగో!

chiranjeevi first reaction to boss party song
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. చాలా ఏళ్ల తర్వాత చిరు పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలోని ‘బాస్‌ పార్టీ’ రిలికల్ పాట సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ పాటకు అద్భుత ఆదరణ లభిస్తోంది. లిరిక్స్, దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్స్, చిరు స్టెప్పులు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. దాంతో, లక్షలాది వ్యూస్ తో  ఈ పాట దూసుకెళ్తోంది. 

తొలుత ఈ మాస్‌ పాటను ట్యూన్ చేసిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్.. చిరంజీవి, దర్శకుడు బాబీతో పాటు సుకుమార్, చిత్ర నిర్మాతలకు వినిపించారు. ఈ పాట వినగానే అభిమానులను మించిన విధంగా వాళ్లంతా ఫిదా అయ్యారు. తొలిసారి పాట విన్నప్పుడు వారు ఇచ్చిన రియాక్షన్‌కు సంబంధించి చిత్ర బృందం తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. చిరు పాటను ఆస్వాదిస్తూ, చిన్నపిల్లాడిలా మారిపోయారు. సోఫాలో కూర్చుండే బీట్స్ కు తగ్గట్టు స్టెప్పులు వేశారు. సుకుమార్, బాబీ సైతం పొంగిపోయారు. దేవిశ్రీకి అభినందనలు తెలిపారు.
Go Back to Shorts
megastar
Chiranjeevi
boss party
WaltairVeerayya
song
dsp
sukumar

More Telugu News