ఇషాన్​ కిషన్ మరో సెంచరీ.. ఈ సారి రంజీ ట్రోఫీలో!

ishan kishan hits another century
షార్ట్స్‌లో చూడండి
భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగి అందరి దృష్టిని ఆకర్షించిన ఇషాన్ ఇప్పుడు రంజీల్లోనూ దుమ్మురేపుతున్నాడు. తన స్వరాష్ట్రం ఝార్ఖండ్ తరఫున ఆడుతున్న ఇషాన్.. కేరళపై సెంచరీ కొట్టి తన జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ లో కేరళ తొలి ఇన్నింగ్స్ లో 475 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రతిగా ఝార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ లో 340 పరుగులు చేసింది. 

ఓ దశలో 114 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఝార్ఖండ్ ను ఇషాన్ ఆదుకున్నాడు. అతను మొత్తం 195 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 132 పరుగులు రాబట్టడంతో ఝార్ఖండ్ కోలుకుంది. రంజీల్లో ఇషాన్ కు ఇది ఆరో సెంచరీ కావడం విశేషం. 175 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన కేరళ అనంతరం రెండో ఇన్నింగ్స్ లో గురువారం ఆట ముగిసే సమయానికి 60/1 స్కోరుతో నిలిచింది.
Go Back to Shorts
ishan kishan
Cricket
ranji
century

More Telugu News