నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న రష్మిక సినిమా
- బాలీవుడ్ చిత్రం 'మిషన్ మజ్ను'లో నటించిన రష్మిక
- ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా
- జనవరి 20న ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. 1970ల నాటి కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో రా ఏజెంట్ గా సిద్ధార్ కనిపించనున్నాడు. శాంతను బగ్చీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గరిమా మెహతా, అమర్ బుటాలా, రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు.