తనకు పెళ్లి అయిపోయిందనే వార్తలపై అంజలి స్పందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తనకు పెళ్లి అయిపోయిందనే వార్తలపై అంజలి స్పందన

Actress Anjali response on her marriage news
  • అంజలి పెళ్లి చేసుకుందంటూ కొంత కాలంగా ప్రచారం
  • ఈ వార్తల్లో నిజం లేదన్న అంజలి
  • ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని వ్యాఖ్య
తెలుగు భామ అంజలికి తమిళనాడులో కూడా చాలా క్రేజ్ ఉంది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ ఆమె బిజీగా ఉంటోంది. తాజాగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అంతేకాదు, ఐటెం సాంగ్స్ లలో కూడా తళుక్కున మెరుస్తోంది. గతంలో తమిళ హీరో జైతో అంజలి ప్రేమలో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇది నిజమే అన్నట్టుగా వీరిద్దరూ కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరూ దూరమయ్యారు. 

ఈ క్రమంలో తాజాగా అంజలి పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ... తనకు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని, తాను అమెరికాలో నివాసం ఉంటున్నట్టు రకరకాలుగా ప్రచారం జరుగుతోందని... ఆ ప్రచారంలో నిజం లేదని చెప్పింది. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా తనకు లేదని తెలిపింది. తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని... సమయం వచ్చినప్పుడు తన వివాహం జరుగుతుందని చెప్పింది.
Advertisement
Anjali
Tollywood
Kollywood
Marriage

More Telugu News