ఈ ఏడాది బరిలో కనిపించని బాలయ్య!
- క్రితం ఏడాదిలో 'అఖండ'తో సందడి చేసిన బాలయ్య
- ఈ ఏడాదిలో ఆయన సినిమా లేకపోవడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తి
- తలా రెండు సినిమాలు చేసిన చిరూ .. నాగ్ .. వెంకీ
- ఒక్కొక్కరూ ఒక్కో హిట్ తో ముందుకు
ఇక సీనియర్ స్టార్ హీరోల వరకే తీసుకుంటే, ఈ ఏడాది చిరంజీవి రెండు సినిమాలు చేశారు. భారీ బడ్జెట్ తో రూపొందిన 'ఆచార్య' ఆశించినస్థాయిని అందుకోలేకపోయింది. చరణ్ - పూజ హెగ్డేకి గల క్రేజ్ కూడా ఈ సినిమా ఫలితాన్ని సక్సెస్ దిశగా పరిగెత్తించలేకపోయింది. హీరోయిన్ తో పాటు ఎంటర్టయిన్మెంట్ ఏ మాత్రం లేని 'గాడ్ ఫాదర్' మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. అభిమానులు అసంతృప్తి చెందకుండా అలా ఆయన బ్యాలెన్స్ చేయగలిగారు.
ఇక ఈ ఏడాదిలో వెంకటేశ్ 'ఎఫ్ 3' .. 'ఓరి దేవుడా' సినిమాలు చేశారు. 'ఎఫ్ 3' సినిమా ఆయన అభిమానులను ఫుల్ ఖుషీ చేసింది. ఇక నాగార్జున కూడా 'బంగార్రాజు' .. ' ది ఘోస్ట్' సినిమాలను చేయగా, ''బంగార్రాజు' మాత్రమే ఆడియన్స్ ను అలరించింది. ఇలా ఈ నలుగురు సీనియర్ స్టార్స్ లో ఈ ఏడాది బాలయ్య నుంచి సినిమా లేకపోగా. మిగతా ముగ్గురు హీరోలు ఒక్కో హిట్ ను నమోదు చేశారు.